బాబు కుల రాజకీయాలు చేస్తున్నారుతూర్పు గోదావరి: చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ముమ్మిడివరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.  ధర్మ పోరాటం పేరుతో తండ్రి కుమారులు కామెడీ షోలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. ప్రత్యేక హోదా లె స్తామని చంద్రబాబు ఓట్లు వేయించుకొని మాట తప్పారన్నారు. మత్స్యకారులను ఎస్సీలుగా మార్చుతానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు హామీ అమలు చేయమని వెళ్తే తాట తీస్తానని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు.  
Back to Top