పేద కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ సాయం

పెద్దవడుగూరు : భ‌ర్త‌ను కోల్పోయి, కుమారుల చ‌దువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయూత‌నందించింది. అనంత‌పురం జిల్లా  పెద్ద వ‌డుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన సరోజమ్మకు వైయ‌స్ఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు గజరాంపల్లి పెరుమళ్ల జీవానందరెడ్డి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. సరోజమ్మ భర్త సుంకిరెడ్డి ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో ఇద్దరు కుమారులు కృష్ణారెడ్డి బీటెక్, రెండవ కుమారుడు శేషారెడ్డి పదో తరగతి చదువుతున్నారు. కుటుంబ పోషణ బరువై పిల్లల చదువులు ఆగిపోతాయని బాధపడుతున్న ఆమె దీనస్థితిని వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన నాయకులు గురువారం పాపినేపాళ్యం వద్ద భోజన విరామ సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బాధితురాలికి చెక్‌ అందజేశారు. రైతు విభాగం రాష్ట్ర నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామియాదవ్, పెద్దవడుగూరు సింగిల్‌ విండో అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, కొండూరు దేవమోహన్‌రెడ్డి, శేషారెడ్డి, భీమునిపల్లి రామచంద్రారెడ్డి, గుత్తిఅనంతపురం విశ్వనాథరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Back to Top