2019లో మన రాజ్యం వస్తుంది

గంగుల ప్రభాకర్‌
ముత్యాలపాడు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మరో ఏడాదిలో ఈ దుష్టపాలనకు అంతం వస్తుందని, 2019లో మన రాజ్యం వస్తుందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముత్యాలపాడులో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గంగుల ప్రసంగించారు. ప్రతి ఒక్కరు వైయస్‌జగన్‌ మోహన్‌ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. 
గంగుల నాని
పాదయాత్ర మొదలైనప్పుటి నుంచి ఎంతోమంది ప్రజలు వచ్చి వైయస్‌ జగనన్నకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే వైయస్‌ జగనన్నకు మద్దతు ప్రకటించాలని కోరారు.
 
Back to Top