చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌

 చిత్తూరు : వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 55వ రోజు చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజక వర్గంలోకి ప్ర‌వేశించింది. ఆదివారం ఉదయం పూడిబట్లబయలు గ్రామంలో దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్ర‌హం, పార్టీ జెండాలను వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గుండ్లగుట్లపల్లి మీదుగా దామల చెరువు చేరుకొని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు​పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. పూతలపట్టు నియోజక వర్గంలోకి వైయ‌స్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అనంతరం గొట్టాల క్రాస్‌ రోడ్డు మీదుగా గుండ్లపల్లి చేరుకొని వైయ‌స్‌ఆర్‌ విగ్రహం, పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత సవటపల్లి, పొలకల సంత గేట్‌, పాటూరు మీదుగా చౌడుపల్లిక్రాస్‌రోడ్డు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6గంటలకు మొరవ పాటూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుంది.  

తాజా ఫోటోలు

Back to Top