53వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో నిర్వీరామంగా కొనసాగుతోంది. ఈ మేరకు 53వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదూం మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలవుతుంది. 8.30 గంటలకు గాండ్లపల్లి, 9 గంటలకు కంబంవారిపల్లి, 10 గంటలకు కందూరు క్రాస్, 11.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3 గంటలకు సదూంకు చేరుకుంటారు. 4 గంటలకు బట్టువారిపల్లి, 5 గంటలకు గడ్కవారిపల్లెకు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు 53వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
 
Back to Top