బ్లో అవుట్ బాధితులకు వైయస్ జగన్ పరామర్శ

 నగరంలోని ఓఎన్ జిసీ బ్లోఅవుట్ బాధితులను  వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. వారి కష్టాలను
తెలుసుకుంటూ, వారికి తగిన న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం
జూన్ చివరి వారంలోనే నగరంలో గెయిల్ కు చెందిన పైప్ లైన్ పేలి 22 మంది మరణించగా,
అనేక మంది క్షతగాత్రులు అయ్యారు. అప్పట్లో గాయపడిన వారిని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా
జననేత కలుసుకున్నారు. తమకు ఇంకా న్యాయం జరగని విషయాన్ని వారు ఈ సందర్భంగా వైయస్
జగన్ దృష్టికి తీసుకుని రాగా, వారికి న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా వైయస్
జగన్ భరోసా ఇచ్చారు. 

Back to Top