ఉమ్మాలపేట నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

నెల్లూరు:  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 70వ రోజుకు చేరుకుంది.  బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా ఉమ్మాలపేట శివారు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది.
వేలాది మంది ప్రజలు వైయ‌స్‌ జగన్‌తో కలిసి నడిచారు. దారిపొడువునా ప్రజలు ఆయనకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి వైయ‌స్‌ జగన్‌ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు.

 Back to Top