సాయిశ్రీ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభం

ప్రొద్దుటూరు: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆరో రోజు ఆదివారం వైయస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్‌ నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు కదిలారు.

అమృతనగర్‌, చెన్నమ్మపేట, కమననూరు, రాధా నగర్‌, నేలటూరు క్రాస్‌రోడ్డు, ఎర్రబల్లి క్రాస్‌ రోడ్డు, దువ్వూరు మీదుగా  ఈ రోజు యాత్ర సాగనుంది. ఐదో రోజు యాత్ర పూర్తయ్యే సమయానికి జగన్‌ మొత్తం 64.2 కిలోమీటర్లు నడిచారు. శనివారం నాడు 13 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
Back to Top