ఐదు రోజుల‌కోసారి మంచినీరు


చిత్తూరు:  తాగ‌డానికి మంచి నీరు కరువైంద‌ని పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో వాల్మీకిపురం ఇందిర‌మ్మ కాల‌నీవాసులు ఖాళీ బిందెల‌తో నిర‌స‌న తెలిపారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఇందిర‌మ్మ కాల‌నీకి వ‌చ్చిన జ‌న‌నేత‌కు స్థానిక మ‌హిళ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. కాల‌నీలో ఐదు రోజుల‌కు ఒక‌సారి మంచినీరు వ‌స్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చ‌దువుకున్న పిల్ల‌ల‌కు ఉద్యోగాలు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top