కృష్ణా జిల్లా: ప‌్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వెన్నూతల గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామ వీధుల్లో పూలవర్షం కురిపించి, డప్పు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు.