కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలో కాసేపట్లో బహిరంగ సభ జరుగనుంది. ఇవాళ ఉదయం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి రామళ్లకోట, బోయినపల్లె మీదుగా సాగుతోంది. కాసేపట్లో వెల్దుర్తి పట్టణంలోని వైయస్ జగన్‌పాదయాత్ర చేరుకుంటుంది. వైయస్ జగన్ కోసం స్థానికులు అధిక సంఖ్యలో వెల్దుర్తికి తరలిరావడంతో మండల కేంద్రం జనసంద్రమైంది.