జననేతను కలిసిన నెమ్మలగుంట గ్రామస్తులు

గంగాధర నెల్లూరు: చంద్రబాబు పాలనలో అభివృద్ధి కుంటుపడిందని నెమ్మలగుంట వాసులు మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెమ్మలగుంటకు వచ్చిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని  ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జననేతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశాడని, గ్రామానికి సరైన రోడ్లు లేవు, ఉపాధి హామీ పథకం అమలు చేయకపోవడంతో పూటగడవడం లేదన్నారు. 
 
Back to Top