కతుంగ క్రాస్‌ రోడ్డులో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ క‌తుంగ క్రాస్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. జననేత వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైయ‌స్‌ జగన్, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
Back to Top