200 కిలోమీట‌ర్లు దాటిన‌ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర

క‌ర్నూలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోని ముద్ద‌వ‌రం గ్రామానికి చేరుకున్నారు. ఇక్క‌డితో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 200 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. క‌ర్నూలు జిల్లాలోని గొడిగనూరులో 100 కిలోమీట‌ర్లు పూర్తి అయిన పాద‌యాత్ర ఇదే జిల్లాలో మ‌రో మైలు రాయిని చేరుకుంది. ఈ సంద‌ర్భంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన రాజ‌న్న బిడ్డ‌ను ప్ర‌జ‌లు పూల‌బాట వేశారు. ఆత్మీయ స్వాగ‌తం ప‌లికి, త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు.
Back to Top