నూజివీడు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కృష్ణా జిల్లా నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 142వ రోజు నూజివీడు శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలు జననేత వెంట అడుగులు వేస్తున్నారు. నూజివీడు నుంచి కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావచర్లకు వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమౌతుంది. వడ్లమాను మీదుగా ఆగిరిపల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్నబిడ్డ ఇక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ.. జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. 

 

Back to Top