57వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 57వ రోజు షెడ్యూల్‌ వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బత్తులవారిపల్లె నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు మిట్టపాలెం, 10 గంటలకు వెంకటాపురం, 10.30 గంటలకు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెన్నుమూరు మండలం బండకిందపల్లెలోకి ప్రవేశిస్తారు. 11 గంటలకు రాఘవరెడ్డిపల్లి, 11.30 గంటలకు మాణిక్యరాయునిపల్లె చేరుకుంటారు. 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 4 గంటలకు పెన్నుమూరు, 4.45 గంటలకు గొబ్బిల్ల మిట్ట, 5 గంటలకు గాంధీపురం, 5.30 గంటలకు చిప్పరపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది.
 
Back to Top