244వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 యలమంచిలి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 244వ రోజు పాద‌యాత్ర శుక్రవారం ఉదయం జననేత యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.  అక్కడి నుంచి రేగుపాలెం జంక్షన్‌, మళ్లవరం, లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం, సోమన్నపాలెం మీదుగా గాంధీనగర్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంత‌రం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. యలమంచిలి మీదుగా కొత్తపాలెం క్రాస్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.  

Back to Top