237వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 237వ రోజు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరాపల్లి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించనుంది.  నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గన్నవరం మెట్టా, శరభవరం, శృంగవరం చేరుకున్న అనంతరం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. గాంధీ నగర్‌, వై. దొంగపేట జంక్షన్‌, ఎర్రవారం జంక్షన్‌ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు.  తూర్పు గోదావ‌రి జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 50 రోజులుగా 17 నియోజకవర్గాల్లో 32 మండలాలు, 232 గ్రామాల్లో దిగ్విజయంగా సాగింది. 
  

తాజా ఫోటోలు

Back to Top