నిడదవోలు నుంచి 185వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

 
ప‌శ్చిమ గోదావ‌రి :   వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ ​జగన్‌ ఆదివారం ఉదయం పాదయాత్రను నిడదవోలు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారవరం, మర్కొండపాడుకు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అనంతరం చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ ఇక్కడే బస చేస్తారు. వైయ‌స్‌ జగన్‌ మల్లవరంలో బీసీలతో ఆత్మీయ సమావేశం కానున్నారు.  Back to Top