పెర‌వాలి నుంచి 184వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 
ప‌శ్చిమ గోదావ‌రి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ శనివారం ఉదయం పెరవాలి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కల్వచర్ల, డి ముప్పవరం చేరుకుని వైయ‌స్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి సమిశ్ర గూడెం మీదుగా నిడదవోలు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నిడదవోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 


Back to Top