130వ రోజు ప్ర‌జా సంక‌ల్స యాత్ర ప్రారంభం

గుంటూరు: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర 130వ రోజుకు చేరుకుంది. ప్ర‌స్తుతం  గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు అడుగడుగునా తమ సమస్యలను రాజన్న బిడ్డకు ఏకరవు పెడుతున్నారు.  శనివారం ఉదయం  వైయ‌స్ జ‌గ‌న్‌ శేకుర్‌ గ్రామ శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి సంగం జాగర్లమూడి మీదుగా అంగల కుదురు చేరుకుంటారు.  భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రాంభమౌతుంది. సుల్తానాబాద్‌ మీదుగా తెనాలి పురవేదిక సెంటర్‌ చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతారు.  


Back to Top