ప్రారంభ‌మైన 117వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


గుంటూరు: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు నేటికి 117వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ ఉప్ప‌ల‌పాడు శివారు నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అక్క‌డి నుంచి జ‌రుగుల‌వారిపాలెం, మిట్ట‌పాలెం, దండ‌మూడి, మానుకొండువారిపాలెం, పోలిరెడ్డిపాలెం మీదుగా చిలక‌లూరిపేట వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. పోలిరెడ్డిపాలెంలో జనంతో మ‌మేకం కావ‌డంతో పాటు చిలక‌లూరిపేట క‌ళామందిర్ సెంట‌ర్ వ‌ద్ద నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తారు. 
Back to Top