51వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 51వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపత్రి గ్రామం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి 9.30 గంటలకు పాతకోటపల్లి, 10.30 గంటలకు బీదవారిపల్లెక్రాస్, 11 గంటలకు గండబోయనపల్లి వరకు సాగుతుంది. 12 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3 గంటలకు డెకలకొన, 4 గంటలకు కలికిరి మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 గంటలకు ప్రజా సంకల్ప యాత్ర 51వ రోజు ముగుస్తుంది.
 
Back to Top