వైయ‌స్ జ‌గ‌న్ 37వ రోజు పాద‌యాత్ర ప్రారంభం

అనంతపురం : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 37వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం అయ్యింది. అక్క‌డి నుంచి తుమ్మల, తిప్పేపల్లి క్రాస్, రావులచెరువు ఎస్సీ కాలనీలో మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగనుంది. ముందుగా రావులచెరువు గ్రామంలో వైయ‌స్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం యాత్ర కొనసాగిస్తూ ఎర్రగుంటపల్లి తండా క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రావులచెరువు తండా, వెంకటతిమ్మాపురంల మీదుగా దర్శినమలకు చేరుకుని పాదయాత్రను ముగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 
Back to Top