27వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 27వ రోజు షెడ్యూల్‌ ఖారారైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను గుత్తి నుంచి ప్రారంభిస్తారు. 9 గంటలకు తాడిపత్రి నియోజకవర్గం పెద్దవదుగూరు మండలంలోకి ప్రవేశిస్తారు. 10.30 గంటలకు ఆవులంపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. 12 గంటలకు మధ్యాహ్నం భోజన విరామం. 3 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు పెద్దవదుగూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 5 గంటలకు చిన్న వదుగూరుకు వెళ్తారు. రాత్రి 6 గంటల వరకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంద‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శీల ర‌ఘురామ్ వెల్ల‌డించారు.
  
Back to Top