19వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర షెడ్యూల్‌


క‌ర్నూలు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 19వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ర్నూలు జిల్లా కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌ట గిరి గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఉద‌యం 9.30 గంట‌ల‌కు కోడుమూరు ప‌ట్ట‌ణంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర అడుగుపెడుతోంది. ప‌ట్ట‌ణంలోని కోట్ల స‌ర్కిల్‌కు చేరుకుంటారు. 10 గంట‌ల‌కు కోడుమూరు ప‌ట్ట‌ణంలోని కొత్త బ‌స్టాండ్‌కు చేరుకుంటారు. అక్క‌డి నుంచి వ‌ర్కురు ఎస్సీ కాల‌నీలో వైయ‌స్ జ‌గ‌న్ జెండా ఆవిష్క‌ర‌ణ చేస్తారు. 12.30 గంట‌ల‌కు భోజ‌న విరామం ఉంటుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పాద‌యాత్ర పునఃప్రారంభ‌మ‌వుతోంది. 3.30 గంట‌ల‌కు వ‌ర్కురు నుంచి 
పాద‌యాత్ర‌గా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశిస్తారు. 5.30 గంట‌ల‌కు గోనెగండ్ల మండ‌లం వేముగోడు గ్రామానికి వైయ‌స్‌
జ‌గ‌న్ చేరుకుంటారు. అక్క‌డి నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పాద‌యాత్ర కొన‌సాగుతోంది.
Back to Top