పాదయాత్రను విజయవంతం చేయాలి

దువ్వూరు : ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే  పార్టీ మండల నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో గ్రామాల్లోని రైతుల, రైతు కూలీల, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందకని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 125 నియోజకవర్గాల్లో 180 రోజుల పాటు 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం అసాధారణ విషయమని ఆయన పేర్కొన్నారు.

12న దువ్వూరులో ప్రజాసంకల్పయాత్ర
దువ్వూరు మండల సరిహద్దులోని నేలటూరు శివాలయం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లోని ప్రజల సమస్యలను వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు దువ్వూరు సెంటర్‌లో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి ఆంజనేయస్వామి గుడి వద్ద బస చేస్తారని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

పాదయాత్రను విజయవంతం చేయాలి
దువ్వూరు మండల పరిధిలోని వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన వెంట నడిచి పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి కోరారు.  సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, కానాల జయచంద్రారెడ్డి, మాజీ సింగ్‌ల్‌విండో ప్రెసిడెంట్‌ గుర్రాల మునిరెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి, కోగటం వీరారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు జెర్రి నడిపి ఓబయ్య, హరి, వీవీ స్వామి, వీరయ్య, ఎంపీటీసీలు సానా కిరణ్‌కుమార్‌రెడ్డి, వీరమోహన్, కృష్ణయ్య, సర్పంచ్‌లు లక్ష్మిరెడ్డి, రామయ్య, మండల యూత్‌ ప్రెసిడెంట్‌ ముడుమాల శివశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, కాసా సుదర్శన్‌రెడ్డి, అమీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 


Back to Top