కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పాణ్యం సిమెంట్ ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. మీరు ముఖ్యమంత్రి కాగానే మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. అంతకు ముందుకు ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యా రంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు.