236వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర షెడ్యూల్‌

  
తూర్పుగోదావరి జిల్లా :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 236వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా తుని నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను తుని శివారు నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కోటనందూరు మండలంలోని తాటిపాక, బిల్లనందూరు క్రాస్‌, బొడ్డవరం క్రాస్‌ మీదుగా జగన్నాథపురం క్రాస్‌ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. 

Back to Top