కుప్పంబాదూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
చిత్తూరు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 61వ రోజు  చిత్తూరు జిల్లా  చంద్ర‌గిరి నియోజ‌క‌వర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు నుంచి ప్రారంభ‌మైంది. శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. అక్కడి నుంచి ఒడ్డుకల్వ, సురవారి పల్లి క్రాస్‌రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, రామిరెడ్డి పల్లి మీదుగా గంగిరెడ్డి పల్లి క్రాస్‌ రోడ్డుకు చేరుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర ప్రారంభమై కమ్మ కండ్రిగ మీదుగా రామచంద్రాపురం చేరుకుని అక్కడ వైయ‌స్‌ జగన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. లక్ష్మీనగర్‌, నడవలూరు, పాత కందులవారి పల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి వైఎస్‌ జగన్‌ పాత కందులవారి పల్లిలోనే బస చేస్తారు. 

Back to Top