వేప‌కుప్పం నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

చిత్తూరు: ప్రజాసంకల్పయాత్ర  60వ రోజు శుక్రవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పాత వేపకుప్పం శివారు నుంచి  ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌గా  ఎల్వీ పురం క్రాస్‌, నేతకుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, సి. కాలేపల్లికి చేరుకుంటుంది. 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం  మధ్యాహ్నం 3గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిటతూరు, హరిజనవాడ, రాయలచెరువుల మీదుగా కుప్పం బాదురు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.  

Back to Top