ముగిసిన 52వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన 52వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొద్దిసేప‌టి క్రిత‌మే ముగిసింది. గురువారం ఉద‌యం చిత్తూరు జిల్లా కలికిరి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ ప్రారంభమైంది. అక్కడి నుంచి అసిరెడ్డిగారిపల్లి, కొత్తపల్లి క్రాస్ మీదుగా కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్నారు. ఈ రోజు యాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలోని ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లిలో జనంతో వైయ‌స్‌ జగన్‌ మమేకమ‌య్యారు.  పెద్దూరులో కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి వైయ‌స్ జ‌గ‌న్‌కు మద్దతు తెలిపారు. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ 12.5 కిలోమీట‌ర్లు న‌డిచారు.
Back to Top