ముగిసిన 53వ ప్రజా సంకల్ప యాత్ర

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 53వ రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ముగిసింది. శుక్రవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గంలోని కురవల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గాండ్లవారిపల్లె, కంభంవారిపల్లె మీదుగా కందూరు క్రాస్, సదాం, భట్టువారిపల్లె, గొడ్కవారిపల్లి వరకు పాదయాత్ర సాగింది. ఇవాల్టితో వైయస్‌ జగన్‌ 740.6 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 
 
Back to Top