500 కిలోమీట‌ర్ల మైలు రాయికి చేరువ‌లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

అనంత‌పురం: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు న‌వంబ‌ర్ 6వ తేదీ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ప్రజలతో మమేకవుతూ ముందుకు సాగుతోన్న జననేత పాదయాత్ర ఇవాళ సాయంత్రం అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరు గ్రామం వ‌ద్ద 500 కిలో కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటారు. శ‌నివారం ఉద‌యం 487.1 కిలోమీట‌ర్ల వ‌ద్ద ధ‌ర్మ‌వ‌రం మండ‌లం చిగిచెర్ల నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు. సాయంత్రానికి ఆయ‌న 500 మైలు రాయిని అధిగ‌మిస్తారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ఉట్లూరు గ్రామ‌స్తులు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.
Back to Top