<br/>కర్నూలు: వైయస్ జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 19వ రోజు పాదయాత్ర కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సోమవారం కోడుమూరు నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైయస్ జగన్ ఎ్రరగుడి మీదుగా కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అడుగుపెట్టిన వైయస్ జగన్ వేముగోడు గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.