వైయస్‌ జగన్‌ అంటే ఇష్టం కాదు.. ప్రాణం

తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌ అంటే ఇష్టం కాదు.. ప్రాణం.. ఆయన్ను కలవడం జీవితంలో మర్చిపోలేం అని రావులపాలెంకు చెందిన దంపతులు అన్నారు. కొత్తపేటలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రావులపాలెంకు చెందిన దంపతులు తమ ఇద్దరు కవల పిల్లలతో వెళ్లి కలిశారు. వైయస్‌ జగన్‌ ఆ చిన్నారులను ఎత్తుకొని ఆశీర్వదించారు. జననేతను కలవడం చాలా సంతోషంగా ఉందని, మళ్లీ ఆయన సీఎం అయిన తరువాత కూడా కలిసి ఫొటో దిగుతామన్నారు. 


Back to Top