ముగిసిన 58వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప య‌త్ర‌ 58వ రోజు  పాద‌యాత్ర కొద్దిసేప‌టి క్రిత‌మే ముగిసింది.  బుధవారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజకవర్గం చిప్పరపల్లి శివారు నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి జెట్టివానిఒడ్డు మీదుగా జెక్కిదొన చేరుకుని వైయ‌స్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గంటావారిపల్లి, బొట్లవారిపల్లి, చిన్నబొట్లవారిపల్లి మీదుగా నల్లవెంగనపల్లి, మటూరు క్రాస్, పాతగుంట, చెన్నుగారిపల్లి, గుండుపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ 12.3 కిలోమీట‌ర్లు న‌డిచారు. న‌ల్ల‌వెంగ‌న‌ప‌ల్లి వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 800 కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది.
Back to Top