ద‌ర్గా సెంట‌ర్ నుంచి 221వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


 తూర్పుగోదావరి జిల్లా : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 221వ రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురంలోని దర్గా సెంటర్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు.
అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైయ‌స్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు. పెద్దాపురం మండలంలోని  కట్టమూరు క్రాస్‌ వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది.  


Back to Top