102వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

 ప్ర‌కాశం :  వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన  ప్రజాసంకల్పయాత్ర 102వ రోజు షెడ్యూల్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం చీమకుర్తి మండలం గడపత్రివారిపాలెం శివారు నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దర్శి మండలంలోకి ప్రవేశిస్తారు. శివరాం పురం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. 10 గంటలకు విరామం​ తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు వైయ‌స్‌ జగన్‌ తిరిగి పాదయాత్ర  ప్రారంభిస్తారు. కొర్రపాటి వారి పాలెం క్రాస్‌ మీదుగా తాళ్లూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆతరువాత సాయంత్రం 5.30 గంటలకు పాదయాత్రను ముగించి రాత్రికి అక్కడే బస చేస్తారు. 

తాజా ఫోటోలు

Back to Top