234వ రోజు పాదయాత్ర ప్రారంభం

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 234వ రోజు తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం డీజేపురం నుంచి ప్రారంభమైంది. శిబిరం నుంచి బయటకు వచ్చిన వైయస్‌ జగన్‌కు రౌతులపూడి ప్రజల ఘనస్వాగతం పలికారు. రౌతులపూడి నుంచి తుని మండలంలోని కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి తునిలో వైయస్‌ జగన్‌ బస చేస్తారు. సాయంత్రం తునిలో జరిగే భారీ బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.  దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. 
Back to Top