గంటి నుంచి 192వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు ప్రారంభమైంది. సోమవారం  ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి జ‌న‌నేత త‌న  పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ గన్నవరం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. 

Back to Top