ఆదర్శరైతు వ్యవస్థను పునరుద్ధరిస్తా

అనంతపురం:

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి మంచిపేరు రాకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు కుట్రపూరితంగా ఆదర్శ వ్యవస్థను తొలగించారని రైతులు వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. కదిరి నియోజకవర్గంలో కటారుపల్లిలో ప్రజా సంకల్పయాత్రలో వారు పాల్గొని వైయస్‌ జగన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, రైతులకు వారధిగా పనిచేసేందుకు గతంలో వైయస్‌ఆర్‌ ఆదర్శ రైతులను నియమించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మమ్మల్ని ఊడబెరికారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్‌ జగన్‌ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ  వారికి భరోసా ఇచ్చారు. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. 

Back to Top