బాలుడి వైద్యానికి వైయస్‌ జగన్‌ సాయం

తూర్పుగోదావరి జిల్లా: ఓ బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయిన వైయస్‌ జగన్‌ వైద్యానికి సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ ఆర్బీకొత్తూరుకు చెందిన ఒక మహిళ తన కుమారుడిని వెంట తీసుకొచ్చి వైయస్‌ జగన్‌ను కలిసింది. తన కుమారుడు శశికిరణ్‌కు రక్తం గడ్డకట్టడంతో నడవలేనిస్థితిలో ఉన్నాడని, మూడుపూటల తిండి తినలేని స్థితిలో ఉన్న తాము వైద్యం చేయించుకోలేకపోతున్నామని, సాయం చేయాలని కన్నీరు పెట్టుకుంది. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైయస్‌ జగన్‌ సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. 
Back to Top