నేడు రైతులతో వైయ‌స్‌ జగన్‌ ముఖాముఖి


క‌ర్నూలు:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కోడుమూరు సోమప్ప సర్కిల్లో  రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని వైయస్ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ తాగునీరు, సాగునీరు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం తదితర సాగు సమస్యలపై వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ముఖాముఖి మాట్లాడేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులంతా తరలిరావాలని కోరారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు.  


Back to Top