కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 19వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోకి వైయస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది. సోమవారం ఉదయంవెంకటగిరి నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. అక్కడి నుంచికోడుమూరు సోమప్ప కోట సర్కిల్ లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వక్కూరు ఎస్సీ కాలనీలో పార్టీ జెండాను వైయస్ జగన్ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తరువాత గోనేగండ్ల మండలంలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. వేముగోడులో ఈరోజు పాదయాత్రను ముగించి, అక్కడే బస చేస్తారు.