224వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

 

తూర్పుగోదావరి జిల్లా :  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 224వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం వీరవరం నుంచి పాదయాత్ర కొనసాగుతుంది. రాజుపాలెం, చంద్రమాంపల్లి, దివిలి మీదగా విరవ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. జననేతతో కలిసి నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు.


Back to Top