తొమ్మిదో రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్‌.కృష్ణాపురంలో పాదయాత‍్రను మొదలుపెట్టారు.  ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర ఏడు రోజుల పాటు వైయ‌స్ఆర్ జిల్లాలో పూర్తి చేసుకొని నిన్న క‌ర్నూలు జిల్లాలోకి ప్ర‌వేశించింది. జ‌న‌నేత అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ... ఆర్‌.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైయ‌స్‌ జగన్‌ బస చేస్తారు.
 

 

Back to Top