త‌లుపూరు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం


నెల్లూరు: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా  సైదాపురం మండలం తలుపూరు నుంచి బుధవారం ఉదయం 76వ రోజు పాదయాత్ర ప్రారంభ‌మైంది.  అక్క‌డి నుంచి సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని మలిచేడు క్రాస్‌, డేగపూడి, ఇనుకుర్తి, మర్రిపల్లి మీదగా పొదలకూరు వరకూ ఈ రోజు పాదయాత్ర కొనసాగిస్తారు. పొదలకూరు సెంటర్‌లో బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు.




Back to Top