ప్రజా సంకల్ప యాత్ర 30వ రోజు షెడ్యూల్‌

 
అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 30వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని పాపినేనిపాలెం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి గార్లదిన్నె మండలం జమ్ములదిన్నె తాండకు వైయస్‌ జగన్‌ చేరుకుంటారు. 10 గంటలకు గార్లదిన్నెలో ప్రజలతో మమేకమవుతారు. 12.30 గంటలకు భోజన విరామం. 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 4.30 గంటలకు మార్తాడు గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు 30వ రోజు పాదయాత్ర ముగుస్తుందని తలశీల రఘురాం పేర్కొన్నారు.
 
Back to Top