కొయ్యాన‌పేట నుంచి 296వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం
విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 296వ రోజు సాలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కొయ్య‌న‌పేట నుంచి ప్రారంభ‌మైంది.  అక్క‌డ నుంచి కంచేడువలస క్రాస్, వెంకట భైరిపురం వరకూ సాగుతుందని, అక్కడినుంచి భోజన విరామానంతరం పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం బగ్గందొరవలస, గెడ్డలుప్పి జంక్షన్‌ మీదుగా సాగుతుంది. 


ఎవరెన్ని కుట్రలు పన్నినా నీకు దేవుడు అండగా ఉన్నాడు.. నీకేం కాదు నాయనా.. నువ్వు రావాలని, నువ్వు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం.. అందుకోసం మేమంతా నీ వెంటే ఉంటాం..’ అని అవ్వాతాతలు, ‘ఎన్ని కష్టాలొచ్చినా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాం’ అని యువత, అక్క చెల్లెమ్మలు ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ ఎదుట స్పష్టీకరించారు. పోటెత్తిన జన వాహిని నడుమ, అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతుండగా వైయ‌స్  జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు.     హత్యాయత్నానికి గురయ్యాక మళ్లీ తమ మధ్యకు వచ్చిన వైయ‌స్ జగన్‌ను చూసి పలువురు మహిళలు దారిపొడవునా ఉద్వేగానికి లోనయ్యారు. ‘నీకెంత కష్టం వచ్చింది నాయనా.. నీకేం కాదు నాయనా.. ఆ భగవంతుడున్నాడు అంటూ ప‌రామ‌ర్శిస్తున్నారు. దారి వెంట జ‌నం బాధ‌లు వింటూ వైయ‌స్ జ‌గ‌న్ వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top